Kalavaibhavam.com(29-Apr): టిఆర్ఎస్వి రాష్ట్ర ఉపాధ్యక్షులు, శ్రీకాంత్ కందుకూరి ఆధ్వర్యంలో రెండవ విడత నిత్యవసర సరుకులు పంపిణీ

టిఆర్ఎస్వి రాష్ట్ర ఉపాధ్యక్షులు, శ్రీకాంత్ కందుకూరి ఆధ్వర్యంలో రెండవ విడత నిత్యవసర సరుకులు పంపిణీ

కరోనా వ్యాధి మహమ్మారిలా విస్తరిస్తున్న ఈ లాక్డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలో ఏ ఒక్క వలస కార్మికుడు పస్తులు ఉండొద్దనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ నీయులు కెసిఆర్ గారి పిలుపునందుకుని ,
నిత్యావసర సరుకుల పంపిణీలో భాగంగా, ఈ రోజు బుధవారం బాగ్ లింగంపల్లిలోని హిమాయత్ నగర్ తహశీల్దార్ కార్యాలయంలో వలస కుటుంబాలకు టిఆర్ఎస్వి రాష్ట్ర ఉపాధ్యక్షులు, శ్రీకాంత్ కందుకూరి ఆధ్వర్యంలో సామాజికదూరం పాటిస్తూ రెండవ విడత నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది.

వయస్సుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరూ ఈ లాక్డౌన్ కు సహకరించడం వల్లనే ఈ కరోనా మహమ్మారిని ఈ స్థాయిలో నియంత్రించ గలుగుతున్నామని ఇందులో భాగస్వాములైన ప్రతి పౌరునికి ఈ సందర్భంగా శ్రీకాంత్ కృతజ్ఞతలు తెలియజేశారు.

కానీ ప్రస్తుత పరిస్థితుల్లో వలస కార్మికుల జీవనం చాలా అస్తవ్యస్తంగా మారిందని వారు ప్రతి రోజూ రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి లో ఉన్నందున వలస కుటుంబాలకు ఎంఆర్ఓచే వారికి నిత్యావసర సరుకులు పంచడం జరుగిందని ఈ విధంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ లలిత కూడా పాల్గొనడం జరిగింది.

ఈ నిత్యావసర సరుకుల్లో భాగంగా
6 Kg గోధుమ పిండి
500 grms కందిపప్పు
1 Kg నూనె
1 Kg టమాటో
1 Kg ఆలుగడ్డ
1 Kg ఉల్లిగడ్డ
2 రకాల పచ్చళ్లు పంపిణీ చేయడం జరిగింది