Kalavaibhavam.com(8-Mar): శిల్పారామం, ఐసిసిఆర్, తెలంగాణ ఫారిన్ స్టూడెంట్స్ అసోసియేషన్ సంయుక్త నిర్వహణలో ఆకట్టుకున్న కథక్, కూచిపూడి మరియు ఫారెన్ స్టూడెంట్స్ ప్రదర్శనలు

By on Mar 8, 2020 in Shilparamam

శిల్పారామం, ఐసిసిఆర్, తెలంగాణ ఫారిన్ స్టూడెంట్స్ అసోసియేషన్ సంయుక్త నిర్వహణలో ఆకట్టుకున్న కథక్, కూచిపూడి మరియు ఫారెన్ స్టూడెంట్స్ ప్రదర్శనలు

శిల్పారామం, మాధాపూర్, ఐసిసిఆర్ మరియు తెలంగాణ ఫారిన్ స్టూడెంట్స్ అసోసియేషన్ సంయుక్త నిర్వహణలో కథక్, కూచిపూడి మరియు ఫారెన్ స్టూడెంట్స్ ప్రదర్శనలు ఎంతగానో అలరించాయి.

ఈ కార్యక్రమానికి ఐసిసిఆర్ డైరెక్టర్ శ్రీ లక్ష్మాజీరావు గారు, శ్రీ సయ్యద్ మొహమ్మద్ ఇబ్రహీం-ఆఫ్ఘనిస్థాన్ రిపబ్లిక్ యొక్క కాన్సులేట్ జనరల్ వారు విచ్చేసి ఆఫ్ఘనిస్థాన్, తుర్క్ మెనిస్థాన్, మారిషస్, సోమాలియా, ఉజ్బెకిస్థాన్, ఇండొనేషియా, దక్షిణాఫ్రికా, తజికిస్థాన్, ఇండియాకి సంబంధించిన విద్యార్థులు తమ దేశ సాంప్రదాయ నృత్యాలను ప్రదర్శించారు.

కుమారి ఇమిలీ ఘోష్ తన కథక్ ప్రదర్శనలో, మాతృవందన, తుమ్మిరీ, రవీంద్రనాథ్ ఠాగోర్ గీతంపై కథక్ నృత్యం ప్రదర్శించారు. శ్రీమతి ప్రియాంక భరడే కూచిపూడి నృత్యప్రదర్శనలో భాగంగా మహాగణపతిం,
తరంగం, థిల్లాన అంశాలను ప్రదర్శించారు. ఉజ్బెకిస్థాన్ జాతీయగీతం, పాటలు ఎంతగానో అలరించాయి.