Kalavaibhavam.com (05.10.19): మధుర సుధామయి బృందం ఆధ్వరంలో అమితంగా ఆకట్టుకున్న సినీ భక్తి సంగీత విభావరి, బతుకమ్మ ఆటాపాటా

మధుర సుధామయి బృందం ఆధ్వరంలో అమితంగా ఆకట్టుకున్న సినీ భక్తి సంగీత విభావరి, బతుకమ్మ ఆటాపాటా

తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ సౌజన్యంతో మధుర సుధామయి బృందం ” శ్రౌవ్యభక్తి గాయని” శ్రీమతి ఆకెళ్ళ పార్వతి సమర్పణలో, శ్రీ సచ్చిదానంద కళాపీఠం అభినందనలతో… శనివారం రవీంద్రభారతిలోని సమావేశ మందిరంలో యువ నవ వర్ధమాన గాయని గాయకుల సినీ భక్తి సంగీత విభావరి ఎంతగానో అలరించాయి.

బతుకమ్మ అట పాటలో మహిళలు, పెద్దలు, అబ్బాయిలు, పిల్లలు అందరు కలిసి పాల్గొన్న “బతుకమ్మ అట పాట” కార్యక్రమానికి తలమానికంగా నిలిచింది. బాల పరిమళం అవార్డీ చి. రాధ శివాని ప్రారంభ నృత్యం ఆకట్టుకుంది.

ఈ కార్యక్రమంలో యువ నవ వర్ధమాన గాయని గాయకులు స్వర్ణ మంగళంపల్లి, ప్రమీల, రచిత, మాస్టర్ ప్రభు, ఎం. రవికుమార్, శ్రీకాంత్, త్రినాధ్ పోల, సూర్య, సిద్ధు, మాస్టర్ రుద్ర, బేబీ ప్రణీత పాడిన భక్తి సంగీత పాటలు ఆహుతులను మైమరిపించాయి.

ఆకెళ్ళ పార్వతి, కె. వాసుదేవ రావు, సరయూ, గాయత్రీ, సంధ్య రాణి, ఎ.ఆర్. గీత తదితరులు ఆలపించిన సాయినాధుని భక్తి పాటలు విశేషంగా నిలిచాయి.

కార్యక్రమంలో భాగంగా ఈ నెల 13న సచ్చిదానంద కళాపీఠం అధ్యక్షులు రత్నాకర శర్మ జన్మదిన సందర్బంగా కేక్ కట్ చేసి అయన ముందస్తు జన్మదిన వేడుకలను ఘనంగా జరిపారు.

మిమిక్రి కళాకారులు కాపర్తి నరేష్, జి.ఎన్.పి వేణుగోపాల్, విజయ్ సంపత్ లు చేసిన మిమిక్రి విశేషంగా ఆకట్టుకుంది.

కార్యక్రమం అనంతరం పాల్గొన్న అతిధులను, పాల్గొన్న గాయని గాయనీమణులను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు.

తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణకు, మధుర సుధామయి బృందం అధ్యక్షులు ఆకెళ్ళ సూర్యనాగేశ్వర రావుకు ఆకెళ్ళ పార్వతి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమానికి మధుర సుధామయి బృందం కార్యదర్శి, శ్రావ్యభక్తి గీత గాయని శ్రీమతి ఆకెళ్ళ పార్వతి, మధుర గాయని శ్రీమతి ఎ.ఆర్. గీత, గిడుగు రాం మూర్తి ఫౌండేషన్ శ్రీమతి కాంతికృష్ణ, సచ్చిదానంద కళాపీఠం అధ్యక్షులు రత్నాకర శర్మ, శ్రీమతి గాయత్రీ, పాత్రికేయులు, కళావైభవం.కామ్ వ్యవస్థాపకులు కె.ఎల్. నరసింహా రావు తదితరులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి శ్రీమతి గాయత్రీ సభాసమన్వయం చేసి ఆకట్టుకున్నారు.

0f9e6843-0ec2-4e7b-acb4-72dcac0da59e 6a93e80f-a0ae-42f8-bb95-a0b7bb9cdd12 456eea8b-5ea5-4e98-b5db-fa31ad1e5ec3 2198acb2-468f-402b-90dd-dcaba1885066 5501b987-9881-4e77-8d80-7cff910ef180 8312c002-8939-48eb-a229-ed12ee6c062a c3e4463c-564c-4b4b-ae3d-aaa606c6698a cc231d9b-1295-4712-8792-a748e835c77d cdbdd6b1-f954-465b-b0b5-ecbb06c65043 d85cf652-ab71-4b7c-b356-1f0bdab1ed6c
<
>