Kalavaibhavam.com(9-May): శ్రీ అభయాంజనేయస్వామివారి దేవాలయం (NGRI గేట్-II, హబ్సిగూడ -ఉప్పల్ రోడ్) లో ” ఆన్‌లైన్ సేవలు, అర్చనలు ” ప్రారంభం

శ్రీ అభయాంజనేయస్వామివారి దేవాలయం (NGRI గేట్-II, హబ్సిగూడ -ఉప్పల్ రోడ్) లో ” ఆన్‌లైన్ సేవలు, అర్చనలు ” ప్రారంభం

Online Sevas & Archanas Stareted at Sri Abhayanjaneya Swamy Temple – NGRI GATE-II, Habsiguda-Uppal Road

నేడు ప్రపంచ వ్యాప్తంగా, దేశంలో, రాష్ట్రంలో కరోనా మహమ్మారి నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా లాక్ డౌన్ సందర్భంగా ప్రజలు జన సంచారంలోకి రావద్దు కనుక, కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాలకు అనుగుణంగా ప్రజలంతా తమ తమ ఇళ్ళలో ఉండి, కరోనా వ్యాధిని తరిమికొట్టుదామని శ్రీ అభయాంజనేయస్వామి దేవస్థానం భక్త మహా శ్రేయులకు కార్యనిర్వహణాధికారిణి విజ్ఞప్తి చేసారు.

దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ఆదేశాల మేరకు శ్రీ అభయాంజనేయస్వామివారి దేవాలయం (NGRI గేట్-II, హబ్సిగూడ -ఉప్పల్ రోడ్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా) లో “ఆన్‌లైన్ లో సేవలు, అర్చనలు” చేయబడునని శ్రీ అభయాంజనేయస్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారిణి తెలిపారు.

భక్తులు తమ తమ గోత్ర నామాలు తెలియజేస్తూ, కింద ఇవ్వబడిన దేవస్థానం అకౌంట్ నందు రుసుము చెల్లించినచో మీ గోత్ర నామాలతో స్వామి వారికి,అర్చనలు, అభిషేకాలు, భోగాలు(ప్రసాదాలు) చేయబడునని తెలిపారు.

శ్రీ అభయాంజనేయస్వామి దేవస్థానం నోట్: హనుమజ్జయంతి సందర్భంగా వైశాఖ బహుళ దశమి తేది: 17/05/2020 ఆదివారం రోజున ఉ . గం 5.30 లకు ” ఏకాదశ మన్య సూక్త అభిషేకము, చందనాలంకరణ, ఆకుపూజలు” నిర్వహించబడును. రుసుము   Rs. 250/-

( కరోనా వైరస్ ప్రభావం దృష్ట్యా భక్తులు ఆలయమునకు రావడానికి నిషేదం ఉన్నందున భక్తులు క్రింద సూచించిన దేవాలయ బ్యాంకు అకౌంట్‌నకు రుసుం చెల్లించి , గోత్ర నామములు మెసేజ్ ద్వారా క్రింద తెలిపిన ఫోన్ నెంబర్ కు తెలిపినచో సంకల్పము చెప్పి పూజలు నిర్వహించ బడును.)

కావున భక్తులు ఇట్టి సదవకాశమును వినియోగించుకొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని శ్రీ అభయాంజనేయస్వామి దేవస్థానం నిర్వాహకులు తెలిపారు.

1) ప్రతి రోజు ఉదయం 6 గంటలకు శ్రీ అభయాంజనేయస్వామివారికి అభిషేకం , సింధూరాలంకరణ నిర్వహించబడును. రుసుము: Rs. 100/-

2) నిత్యార్చన: ప్రతి రోజు ఉదయం 7గంటలకు భక్తుల గోత్రనామములు చదివి , శ్రీ అభయాంజనేయస్వామి వారికి అర్చన నిర్వహించబడును. రుసుము: Rs. 50/- ( ఒక నెలకు )

3) భోగం (ప్రసాదం) రుసుము :

పులిహార / అప్పాలు / చక్కర పొంగళి: Rs.100/-
దద్దోజనము / రవ్వకేసరి: Rs. 200/-
వడమాల: Rs. 400/-
ఆకుపూజ: Rs.20/-
అర్చన: Rs. 10/-

పైన పేర్కొన్న సేవలు స్వామివారికి నిర్వహించబడుతాయని ఆలయ నిర్వాహకులు తెలిపారు.

కావున భక్తులు ఇట్టి సదవకాశమును వినియోగించుకొని స్వామి వారి కృపకు పాత్రులు కాగలరని కోరారు.

నోట్: బ్యాంక్ అకౌంట్ నెంబర్” వివరాలు:
Name: Sri Abhayanjaneya Swamy Temple
S.B A/c No: 52191022439
Bank Name: State Bank of India
IFSC code: SBIN0020087
HABSIGUDA Branch, Hyderabad-07

మరిన్ని వివరాల కోసం సంప్రదించాల్సిన సెల్ నెంబర్: 9912490641

జారీ చేసినవారు
ఇట్లు
కార్యనిర్వహణాధికారిణి
దేవాదాయ – ధర్మాదాయ శాఖ
శ్రీ అభయాంజనేయస్వామి దేవస్థానం
NGRI GATE-II, Habsiguda-Uppal Road .
ఉప్పల్ .మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా.
సర్వేజనః సుఖినోభవంతు.