Kalavaibhavam.com(17-Feb): నిర్మాత ఎన్.ఆర్. అనురాధాదేవికి “వెండితెర దిగ్గజం” పురస్కార ప్రదానం – ముఖ్య అతిధిగా పాల్గొన్న మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్

By on Feb 17, 2020 in Ravindra Bharathi

నిర్మాత ఎన్.ఆర్. అనురాధాదేవికి “వెండితెర దిగ్గజం” పురస్కార ప్రదానం – ముఖ్య అతిధిగా పాల్గొన్న మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్

ముఖ్య అతిధిగా విచ్చేసిన మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ప్రముఖ సినీ నిర్మాత ఎన్.ఆర్. అనురాధాదేవికి ” వెండితెర దిగ్గజం ” పురస్కార ప్రదానం

సోమవారం రవీంద్రభారతిలో ప్రాజ్ఞిక ఫౌండేషన్, సీల్ వెల్ కార్పొరేషన్ సంయుక్త నిర్వహణలో ” వెండితెర వెలుగులు ” శీర్షికన ” స్వరాభిషేకం – 3 ” కార్యక్రమాన్నినిర్వహించారు.

ఈ సందర్బంగా ముఖ్య అతిధిగా విచ్చేసిన తెలంగాణ సాంస్కృతిక, పర్యాటక, ఆబ్కారీ, క్రీడా శాఖల మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ప్రముఖ సినీ నిర్మాత ఎన్.ఆర్. అనురాధాదేవికి ” వెండితెర దిగ్గజం ” పురస్కార ప్రదానం చేసారు.

ప్రాజ్ఞిక ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు ప్రవీణ్ నేతృత్వంలో స్వరాభిషేకం శీర్షికన నిర్వహించిన సంగీత విభావరి అలరించింది.

యువకళావాహిని వై.,కె. నాగేశ్వర్ రావు సభాధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా విచ్చేసిన తెలంగాణ సాంస్కృతిక, పర్యాటక, ఆబ్కారీ, క్రీడా శాఖల మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, విషిత అతిధులుగా , , తెలంగాణ పోలీస్ హోసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, ఆత్మీయ అతిధులుగా తెలంగాణ రాష్ట్ర బిజెపి కన్వినర్ భేటీ బచావో, భేటీ పడావో గీత మూర్తి, ఎస్.వి. రామారావు, గౌరవ అతిధులుగా సీనియర్ పాత్రికేయుడు మహ్మద్ రఫీ, సీల్ వెల్ కార్పొరేషన్ సి.ఎం.డి. బండారు సుబ్బారావు, ప్రాజ్ఞిక ఫౌండేషన్ సంస్థ చైర్మన్ డా. కె. సత్యనారాయణ గౌడ్, వ్యవస్థాపక అధ్యక్షులు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.