రవీంద్రభారతి: తెలంగాణ సాహిత్య అకాడమి ఆధ్వర్యంలో ఈ రోజు (29.07.18, ఆదివారం) ఘనంగా ముగిసిన డా. దాశరథి కృష్ణమాచార్య, డా. సి. నారాయణరెడ్డి గారాల జయంతి వేడుకలు

తెలంగాణ సాహిత్య అకాడమి ఆధ్వర్యంలో ఈ రోజు ఘనంగా ముగిసిన డా. దాశరథి కృష్ణమాచార్య, డా. సి. నారాయణరెడ్డి గారాల జయంతి వేడుకలు

మహాకవులు డా. దాశరధి కృష్ణమాచార్య, డా.సి.నారాయణ రెడ్డి గారల జయంతి వేడుకలు తెలంగాణ కవితా సప్తాహంలో చివరి రోజు కార్యక్రమానికి శ్రీ టి. గౌరీ శంకర్ అద్యక్షత వహించి ప్రసంగించారు.

ముఖ్య అతిథిగా డా. ఎల్లూరి శివారెడ్డి హాజరై ప్రసంగించారు. ప్రత్యేక ప్రసంగంలో డా. కాంచనపల్లి మహాకవి సి.నా.రె. కవితా ప్రస్థానం అనే అంశంపై మాట్లాడారు.

చివరి రోజు తెలంగాణ కవితా సప్తాహం కవి సమ్మేళనంలో పలువురు కవులు పాల్గొని వారి కవితలను చదివి వినిపించారు.

గత ఎనిమిది రోజులుగా తెలంగాణ సాహిత్య అకాడమి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాలు ఎంతో ఉత్స్యాహంగా, రమణీయంగా జరిగాయి. ఈ కార్యక్రమాలు సాహీతీ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

ఈ కార్యక్రమంలో తెలంగాణ సాహిత్య అకాడమి ఛైర్మన్ డా.నందిని సిధారెడ్డి, తెలంగాణ సాహిత్య అకాడమి కార్యదర్శి డా. ఏనుగు నరసింహా రెడ్డి, ముఖ్యమంత్రి ఓ.ఎస్.డి దేశపతి శ్రీనివాస్ పాల్గొన్నారు.

<
>