Kalavaibhavam.com (16.02.19): ఘనంగా రెండో రోజు భక్త రామదాసు జయంతోత్సవాలు – భక్త రామదాస జయంతి మహోత్సవాలను ఇంత గొప్పగా నిర్వహించడం అభినందనీయం – మామిడి హరికృష్ణ

ఘనంగా రెండో రోజు భక్త రామదాసు జయంతోత్సవాలు – భక్త రామదాస జయంతి మహోత్సవాలను ఇంత గొప్పగా నిర్వహించడం అభినందనీయం – మామిడి హరికృష్ణ

భక్త రామదాస జయంతి రెండవ రోజు మహోత్సవాలలో భాగంగా గౌరవ అతిధిగా విచ్చేసిన తెలంగాణా భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ మాట్లాడుతూ.. భక్త రామదాస జయంతి సందర్బంగా ఇంత గొప్పగా ఉత్సవాలను నిర్వహించడం అభినందనీయమన్నారు. నేలకొండపల్లి నుండి మరియు వివిధ ప్రాంతాల నుండి ఇంత పెద్దఎత్తున విద్యార్థులు, సంగీత కళాకారులు ఈ కార్యక్రమానికి విచ్చేసి భక్త రామదాస సంకీర్తనల గోష్ఠి గానంలో పాల్గొనడం గొప్ప విశేషమని కొనియాడారు. గత కొన్నేళ్లుగా ఎన్నో చక్కటి కార్యక్రమాలను నిర్వహిస్తూ.. ఎంతో మంది సంగీత కళాకారులను ప్రోత్సహిస్తూ యరగొల్ల శ్రీనివాస్ యాదవ్ చేస్తున్న కృషి అమోఘమన్నారు.

ప్రముఖ తెలంగాణా వాగ్గేయకారుడు భక్త రామదాసు జయంతి ఉత్సవాలు శ్రీ శ్రీ శ్రీ త్రిదండి రామానుజ చిన్నజీయర్ స్వామి వారి మంగళాశాసనములతో.. తెలంగాణా భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో భద్రాచల రామగాన సమితి, శ్రీవాణీ మ్యూజిక్ అకాడమీల సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ నక్క శ్రీనివాస్ యాదవ్ – వ్యవస్థాపక చైర్మైన్, శ్రీమతి నక్క వెంకటమ్మ, శ్రీ నక్క యాదగిరి స్వామి ఎడ్యుకేషనల్ & స్పోర్ట్స్ ఫౌండేషన్ సమర్పించు…” భక్తరామదాస జయంతి మహోత్సవాలు – 2019 ” తెలుగు లలిత కళాతోరణంలో, మూడు రోజులపాటు ఘనంగా జరుగనువ్న కార్యక్రమాన్ని రెండవ రోజు తెలంగాణా భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ జ్యోతి ప్రకాశనం చేసి ప్రారంభించారు.

ఇలాంటి కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా పిల్లలకు చిన్నప్పటినుంచే వారికి భక్తి, మన సాంస్కృతి, సంప్రదాయాలపైన మంచి అవగాహన లభిస్తుందని పలువురు అతిధులు అన్నారు.

ప్రముఖ సంగీత విద్వాంసులు యరగొల్ల శ్రీనివాస్ సారథ్యంలో ఎంతో వైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో విచ్చేసిన విద్యార్థులు, సంగీత కళాకారులు పాడిన రామదాస విరచిత దాశరథి శతక పద్యాలు, రామదాసు కీర్తనలు అందరిని విశేషంగా అక్కటుకున్నాయి. రామదాసు కీర్తనలు, పద్యాల శ్రావ్యగానాలాపనలు ఎంతో మధురంగా సాగాయి. విచ్చేసిన వారందరు రామనామ స్మరణలో లీనమైపోయారు.

సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ , ఆచార్య కసిరెడ్డి వెంకట రెడ్డి – పూర్వ అధ్యక్షులు, తెలుగు శాఖ, ఉస్మానియా విశ్వవిద్యాలయం, సినీ దర్శకుడు ఆర్.పి. పట్నాయక్, శ్రీమతి యలవర్తి ధనలక్ష్మి – శంకరం వేదిక, శ్రీమతి దీప్తీ వాజపేయి – వాఖ్యత్రి టివి-9 అతిథులుగా పాల్గొని రామదాసు కీర్తనల వైభవాన్ని తిలకించి, కార్యక్రమ సారథి శ్రీనివాస యాదవ్ ను అభినందించారు.

ఈ కార్యక్రమానికి తెలంగాణా భాషా సాంస్కృతిక శాఖ నుండి శ్రీమతి హేమలత, నాగేంద్ర కూడా విచ్చేసి భక్త రామదాస సంకీర్తనల గోష్ఠి గానంలో పాల్గొన్నారు.

కమిటీ చైర్మైన్ నక్క శ్రీనివాస యాదవ్, రత్నాకర శర్మ- సచ్చిదానంద కళాపీఠం, భీమ్ సేన్ మూర్తి, కె.ఎల్. నరసింహారావు- పాత్రికేయులు, కళావైభవం.కామ్ వ్యవస్థాపకులు, పూస నరసింహలు కార్యక్రమ సమన్వయం చేశారు. సుమన, స్వప్నలు గోష్ఠి గాన సమన్వయం చేశారు.

2nd Day- Baktha Ramadasu Program 16.02.19
<
>