Kalavaibhavam.com(8-Mar): శ్రీశైలం: ఫాల్గుణ శుద్ధ చతుర్దశిని పురస్కరించుకుని శాస్తోక్తంగా కామదహనం

శ్రీశైలం: ఫాల్గుణ శుద్ధ చతుర్దశిని పురస్కరించుకుని శాస్తోక్తంగా కామదహనం

శ్రీశైలం: ఈరోజు (08.03.2020) ఫాల్గుణ శుద్ధ చతుర్దశిని పురస్కరించుకుని సాయంకాలం 6.30 గం.లకు ఆలయ ముందుభాగంలోని గంగాధరమండపం వద్ద కామదహన కార్యక్రమం నిర్వహించారు.
.
ఈ కార్యక్రమానికి ముందుగా ఆలయంలో శ్రీ స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలను జరిపించారు.

తరువాత శ్రీ స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆలయ ప్రాంగణంలో మనోహర గుండం ఎదురుగా వేంచేబు చేయించి విశేషపూజలను నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులకు పల్లకీ
సేవ నిర్వహించారు. ఈ పల్లకీసేవలోనే ఉత్సవమూర్తులు గంగాధర మండపం వరకు తోడ్కొని వచ్చారు. ఆ తరువాత శాస్తోక్తంగా పూజదికాలు జరిపించిన అనంతరం గడ్డితో చేయబడిన మన్మధ రూపాన్ని దహనం చేయడం జరిగింది.

అనంతరం ప్రసాదవితరణ కార్యక్రమం జరిగింది.

మన్మధుడు శివతపోభంగం చేయగా, కోపించిన పరమేశ్వరుడు మన్మథుడిని ఫాల్గుణ శుద్ధ చతుర్దశి రోజే దహించాడని పురాణాలు చెబుతున్నాయి. దాని ఆధారం చేసుకునే ఫాల్గుణ శుద్ధ చతుర్దశి రోజున దేవస్థానం కామదహన కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.

కామదహన కార్యక్రమాన్ని వీక్షించడం వలన శివకటాక్షం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *