Kalavaibhavam.com(7-Feb): వనదేవతలను దర్శించుకున్న తెలంగాణ, హిమాచల్‌ ప్రదేశ్‌ రాస్ట్రాల గవర్నర్లు

వనదేవతలను దర్శించుకున్న తెలంగాణ, హిమాచల్‌ ప్రదేశ్‌ రాస్ట్రాల గవర్నర్లు

మేడారం ఫిబ్రవరి 7: తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై, హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ మేడారం చేరుకొని వనదేవతలను దర్శించుకున్నారు.

మేడారం జాతరకు చేరుకున్న గవర్నర్లకు మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌, సత్యవతిరాథోడ్‌, అధికారులు, పూజారులు ఘన స్వాగతం పలికారు. వనదేవతలకు గవర్నర్లు, మంత్రులు పూజలు చేసి ముడుపులు సమర్పించుకున్నారు. వారు మేడారం సమ్మక్క-సారలమ్మ సేవలో పాల్గొన్నారు. గవర్నర్లు నిలువెత్తు బంగారం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.