తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ కార్యకలాపాలు తెలుగులోనే కొనసాగించాలి – ప్రపంచ తెలుగు బాష పరిరక్షణ సమితి అద్యక్షులు కోటిపల్లి సుబ్బారావు

తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ కార్యకలాపాలు తెలుగులోనే కొనసాగించాలిప్రపంచ తెలుగు బాష పరిరక్షణ సమితి అద్యక్షులు కోటిపల్లి సుబ్బారావు

 హైదరాబాద్ డిసెంబర్ 31 (ఎక్స్ ప్రెస్ న్యూస్ ఏజెన్సీ );తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ కార్యకలాపాలన్ని తెలుగులోనే కొనసాగించాలని, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, ప్రపంచ తెలుగు బాష పరిరక్షణ సమితి అద్యక్షులు కోటిపల్లి సుబ్బారావు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు విజ్ఞప్తి చేశారు.. ఎక్స్ ప్రెస్ న్యూస్ ప్రతినిధి తో మాట్లాడుతూ తెలుగు బాష, తెలుగు జాతికి రవి అస్తమించని సామ్రాజ్యం స్టాపించాలని,తెలుగును ప్రపంచబాషగా అభివృద్ధి చేయాలన్న ఆశయ సాధనలో తెలుగు బాష పరిరక్షణ సమితి ఆవిర్భ వించినట్లు తెలిపారు.

ప్రతి తెలుగు వారు తమ పిల్లలను అమెరికా మొదలగు పాచ్యాత్య దేశాలకు పంపించి అభివృద్ధి సాదించాలని,అందుకు గాను ఇంగ్లీష్ మాద్యమంలోనే చదువు సాగించాలని అపోహలతో ఉన్నారనిఇదిసరికాదన్నారు.మాతృబాషలోనేవిద్యాభ్యాసం ద్వారానే, జ్ఞనాభివృదితో పాటు అభివృద్ధి సాద్యమన్నారు. ప్రపంచం లోని మేధావులు ,విద్యావేత్తలు ,మానసిక శాస్త్ర వేత్తలు,ఐక్యరాజ్య సమితి మండలి,యునెస్కో వారు ప్రతి సంవస్సరం మాతృ బాష దినోస్సవ సందర్బంగా విడుదల చేసే నివేదికలో పదే పదే పేర్కొంటున్న విషయాన్నిఈ సందర్బంగా సుబ్బారావు గుర్తు చేశారు.

భారత దేశం లో పూర్తి పరిపాలన, విద్యాభ్యాసం మాతృ బాషలో చేస్తున్న తమిళులు,గుజరాతీలు,పంజాబిలు,మలయాళీలు,మహారాష్ట్రీలు,కన్నడిగులు,బెంగాలీమొదలగువారు ప్రపంచమంత విస్తరించారన్నారు.ఆఫ్రికా,ఐరోపా,ఆసియా,అమెరికా మొదలగు ఖండాంతరాలుగా వారు ఉన్నారన్నారు. వారు వారి పాలనను,మాద్యమాన్ని వారు ఆంగ్లం లోకి మార్చుకోలేదన్నారు..పంజాబి బాష కెనడా దేశం లో అధికార పాలనా బాషగా, తమిళం శ్రీలంక,మలేషియా,సింగపూర్ మొదలగు దేశాల్లో అధికార బాషగా చలామణి అవుతుందని చెప్పారు.కానీ,తెలుగు బాష తెలుగు రాష్ట్రాల్లో సరిగ్గా అమలుచేయకపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు రాస్త్రాల్లోనే తెలుగు అమలు కానపుడు మరే రాష్ట్రాలు,దేశాల్లో అమలు చేస్తాయని ఆయన ప్రశ్నించారు.తెలుగు పూర్తి స్థాయి పాలనా బాషగా అమలు కాకపోతే తెలుగు ఆవశ్యకత ఉండదని, తద్వారా తెలుగు బాషా,తెలుగు జాతి ఉనికి కోల్పోయే ప్రమాదం ఉందన్నారు.

అమెరికా మొదలగు పాచ్యాత్యదేశాలు వెళ్లడానికి మాతృబాషా మాద్యమాన్ని విడిచి పెట్టనక్కరలేదన్నారు..మాతృ బాషలో విద్యాభ్యాసం పిల్లల తెలివి తేటల్ని,మేధస్సును పెంచుతుందని,తద్వారా ఇంగ్లీష్ మొదలుగా గల విదేశీ బాషను సునాయసనంగా నేర్చుకోవచ్చునని ప్రపంచం లో మేధావులు,విద్యావేత్తలు యునెస్కో వారు చెబుతున్నారు.మాతృ బాష ఐన తెలుగులో విద్యాభ్యాసం ద్వారా ఆంగ్లం మొదలు విదేశీ భాషలను, సునాయసనంగా నేర్చుకోవచ్చునని అమెరికా మొదలగు దేశాలకు వెళ్లవచ్చునాన్నారు..కావున తెలుగు బాష వికాసానికై ప్రతి తెలుగు బంధువు కృషి చేయాలని సుబ్బారావు కోరారు.

భారత దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి (1947) నుండి క్రిందటి జనగణన లెక్కలవరకు తెలుగు రెండవ అతి పెద్ద బాష అన్నారు. .అటువంటి రెండవ అతి పెద్ద బాష ఐన తెలుగును వివిద ప్రభుత్వాలు అనుసరిస్తున్న తప్పుడు బాష విదానాలవల్ల నాల్గవ స్టాయికి పడిపోయేందన్నారు..అంటే తెలుగు రెండవ ఉన్నత స్థాయి నుండి క్రిందికి అంతరిస్తుందని,కాబట్టి తెలుగు ప్రభుత్వాలు తమ పాలనను పూర్తిగా భారత దేశం లోని మిగతా రాష్ట్రాల లాగే స్టానికత ఐన తెలుగులో మాత్రమే పాలన సాగించాలన్నారు.. 10 వ తరగతి వరకు తెలుగు మాద్యమంలోనే భోదన సాగించాలని, తెలుగు మాద్యమంలోనే చదివిన వారికి ఉద్యోగాల్లో 80 శాతం రేజర్వేషన్లు కల్పించాలని,కెజి.నుండి పిజి వరకు తెలుగు మాద్యమం ఉండాలని.ఇతర రాష్ట్రలు,దేశాల యందున్న తెలుగువారికి తెలుగు బాషాభి వృద్ధికి, వారి వికాసానికి తెలుగు రాష్ట్రాలు తోడ్పడాలని సుబ్బ రావు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను కోరారు. త్వరలో తెలుగు బాష పరిరక్షణ, తెలుగు జాతి వికాసానికై త్వరలో ప్రచార కార్యక్రమాన్ని చేపట్టబోతున్నట్లు తెలిపారు.