రాజభవన్ ప్రాంగణంలో ఆఖరి రోజైన నేడు  ‘వెన్న ముద్దల’ బతుకమ్మ వేడుకలు; రాజభవన్ ఉద్యోగులతో కలిసి బతుకమ్మ వేడుకలు జరుపుకోవడం తనకు చాలా ప్రత్యేకంగా, అక్క చెల్లెళ్ళతో ఉన్నట్లుంది – గవర్నరు డా. తమిళిసై సౌందరరాజన్ 

బతుకమ్మ సంబురాలను రాజభవన్ ప్రాంగణంలో ఆఖరి రోజైన నేడు  ‘వెన్న ముద్దల’ బతుకమ్మను రాజభవన్ లో పనిచేసే మహిళా ఉద్యోగులు మరియు ఉద్యోగుల కుటుంబ సభ్యులు అందరూ గవర్నరు చేతులమీదుగా బతుకమ్మ కానుకగా అందుకున్న చీరలను కట్టుకుని, రంగు  రంగుల  పూలతో  బతుకమ్మలను  తీర్చిదిద్ది వేడుకలలో పాల్గొన్నారు. వీరితో కలిసి గవర్నరుగారు కూడా అటువంటి చీర ధరించి బతుకమ్మ ఆటపాటలలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గవర్నరు డా. తమిళిసై సౌందరరాజన్ మాట్లాడూతూ, ఇలా రాజభవన్ ఉద్యోగులతో కలిసి బతుకమ్మ వేడుకలు జరుపుకోవడం తనకు చాలా ప్రత్యేకంగా, అక్క చెల్లెళ్ళతో ఉన్నట్లుందని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ వేడుకలలో రాజభవన్ ఉద్యోగుల పిల్లలు పాటలతో, సంప్రదాయ నృత్యాలతో అలరించారు.

<
>