కృష్ణావతారంలో దర్శనమిచ్చిన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి

By on Jan 10, 2020 in Yadadri and Temples

కృష్ణావతారంలో దర్శనమిచ్చిన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి

యాదాద్రి భువనగిరి జనవరి10 (ఎక్స్ ప్రెస్ న్యూస్):  యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి కృష్ణావతారంలో దర్శనమించారు. అధ్యయనోత్సవాల్లో భాగంగా 4వ రోజు నరసింహస్వామిని కృష్ణా అవతారంలో అలంకరించి బాలాలయంలో ఊరేగించారు.తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి సన్నిధిలో అధ్యయనోత్సవాలు వైభవంగా జరుపుతున్నారు. 4వ రోజు ఉదయం స్వామివారిని కృష్ణుడి రూపంలో అలంకరించి బాలాలయంలో సేవపై ఊరేగించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకున్నారు.